22/11/2026, Sunday · 02:16:09 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్య ఆశయాలను కొనసాగిస్తాం!సి.వై. పుల్లయ్య

Yakub Pasha 21/11/2026 6:08 PM ఖమ్మం

కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్య ఆశయాలను కొనసాగిస్తాం!సి.వై. పుల్లయ్య
Want this news as a newspaper clip?Print News Clip

కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్య ఆశయాలను కొనసాగిస్తాం!

సంతాప సభలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి సి.వై. పుల్లయ్య

కామేపల్లి, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

కామేపల్లి మండలం కొత్త లింగాల గ్రామానికి చెందిన సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ సీనియర్ నాయకుడు, ప్రజా ఉద్యమాల సహచరుడు కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఆ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి సి.వై. పుల్లయ్య అన్నారు.కొత్త లింగాల గ్రామంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో  సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ కామేపల్లి–కారేపల్లి సంయుక్త మండలాల సహాయ కార్యదర్శి ఎన్.వి. రాకేష్ అధ్యక్షతన కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్య సంతాప సభ నిర్వహించారు. తొలుత నాయకులు, కార్యకర్తలు సర్వన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా సి.వై. పుల్లయ్య మాట్లాడుతూ.. కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్య జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో, ఎర్రజెండా పట్ల అచంచల విశ్వాసంతో పనిచేశారని కొనియాడారు. గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణానికి, ప్రజా ఉద్యమాల బలోపేతానికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. వయసు పైబడినా, అనారోగ్య సమస్యలు ఎదురైనా పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు.మేడే కార్యక్రమాలు, అమరవీరుల సభలు, పార్టీ మహాసభలు, వివిధ ప్రజా ఉద్యమాల్లో ఆయన అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. సర్వయ్య మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నిబద్ధత కలిగిన సాధారణ కార్యకర్తల కృషి, త్యాగాల పునాదులపైనే కమ్యూనిస్టు ఉద్యమాలు నిలబడతాయని అన్నారు.కామ్రేడ్ సర్వయ్య ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత బలోపేతం చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పుల్లయ్య పిలుపునిచ్చారు.ఈ సంతాప సభలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆవుల అశోక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జాటోత్ కృష్ణ, ఖమ్మం డివిజన్ కార్యదర్శి టీ. ఝాన్సీ, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శివలింగం, ఎస్.కే. లాల్ మియా, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు ఎడ్లపల్లి ఉపేందర్, కేలోతు లక్ష్మణ్, మండల నాయకులు వడ్డే వెంకటేశ్వర్లు, ధరావత్ సక్రు, జరుకుల రామ్‌సింగ్, వీరయ్య, రాజేష్, సక్రం, కృష్ణ, రాజు తదితరులు పాల్గొని కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్యకు ఘనంగా నివాళులర్పించారు.

ఇది కూడా చదవండి :: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో నారాయణ పాఠశాల విద్యార్థుల పతకాల పంట!

Pagidipalli SarvaiahcontinueaspirationsComradePullayya

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

245 Posts

Latest News

ఇంటర్మీడియట్ విద్య విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి! గోగినపల్లి మస్తాన్ జనసేనలోకి ఖమ్మం నేత మాటేటి రవి! మత్స్యకారుల హక్కుల సాధనకు ముదిరాజులంతా ఐక్యం కావాలి! కేబుల్ న్యూస్ ఛానళ్ల రిపోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి! డీపీఆర్ఓకు టీజేఎఫ్ వినతి మున్సిపల్ కార్మికుల డిమాండ్లకు అధికారుల అంగీకారం! 44వ డివిజన్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై విస్తృత ప్రచారం! అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి తక్షణ నోటిఫికేషన్ ఇవ్వాలి! కోర్టు ఉత్తర్వులకే బేఖాతరా..? 85 ఏళ్ల వృద్ధురాలి ఆచూకీ ఏదీ.. వారసత్వ భూములపై మ్యుటేషన్ యత్నాలా! వైరా మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి _ షేక్ లాల్ మహమ్మద్ మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి_ సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్