21/11/2026, Saturday · 08:15:11 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే! మామిడి సోమయ్య

Yakub Pasha 21/11/2026 7:49 AM రాష్ట్ర వార్తలు

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే! మామిడి సోమయ్య
Want this news as a newspaper clip?Print News Clip

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే!

జర్నలిస్టుల ధర్నాకు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మద్దతు

ఇళ్ల స్థలాల సాధన కోసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో జర్నలిస్టుల ఆందోళన

హైదరాబాద్, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఇళ్లు, ఇళ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్టులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. పేద ప్రజల మాదిరిగానే జర్నలిస్టులు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి సైతం ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.ధర్నాకు అధ్యక్షత వహించిన

గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సాధించేందుకు గత 18 ఏళ్లుగా సొసైటీ పోరాటం చేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీలిచ్చి మోసం చేశాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా సమస్యకు పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జర్నలిస్టు సంఘం పేరుతో కొందరు సోకాల్డ్ జర్నలిస్టు నాయకులు తమ సొసైటీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి చర్యలను సహించేది లేదని ఆయన హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రభుత్వం తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు.

ఈ ధర్నాకు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షురాలు హేమ సుదర్శన్, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాస్ గౌడ్, టీజేఎస్ అధికార ప్రతినిధి సలీమ్ పాషా, నగర అధ్యక్షుడు ఎం. నర్సయ్య, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయుడు ఆనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. కోటేశ్వరరావు, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు మెరుగు చంద్రమోహన్, సీనియర్ మహిళా జర్నలిస్టు ప్రియా చౌదరి తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.అలాగే టీజేఎఫ్ నాయకులు కుంచం శ్రీనివాస్, వి. రవికుమార్, ఎం. రవికుమార్, సొసైటీ డైరెక్టర్లు యర్రమిల్లి రామారావు, వీరేశం, మహిళా జర్నలిస్టులు సీబీ లక్ష్మి, నాగవాణి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: పత్తి చేనులో భారీ కొండచిలువ కలకలం!70 కిలోల పైతాన్‌ను సురక్షితంగా పట్టుకున్న అటవీ సిబ్బంది

housing plotsgovernmentresponsibilityprovidejournalistsMamidiSomayya

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

236 Posts

Latest News

వైరా మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి _ షేక్ లాల్ మహమ్మద్ మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి_ సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో నారాయణ పాఠశాల విద్యార్థుల పతకాల పంట! డీఈఓ వాసంతిని మర్యాదపూర్వకంగా కలిసిన పీఆర్టీయూ టీఎస్ నాయకులు పత్తి చేనులో భారీ కొండచిలువ కలకలం!70 కిలోల పైతాన్‌ను సురక్షితంగా పట్టుకున్న అటవీ సిబ్బంది ఉక్కు మహిళ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళి _ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్ ధైర్యం.. తెగువకు ప్రతీక ఝాన్సీ లక్ష్మీబాయి! ప్రభుత్వ మహిళా కళాశాలలో జయంతి వేడుకలు మా భూమి మాకు ఇవ్వండి! టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే భానోత్ చంద్రావతి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి అయ్యప్ప స్వామి విగ్రహాల వితరణ