22/11/2026, Sunday · 02:16:10 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

మత్స్యకారుల హక్కుల సాధనకు ముదిరాజులంతా ఐక్యం కావాలి!

Yakub Pasha 21/11/2026 7:31 PM ఖమ్మం

మత్స్యకారుల హక్కుల సాధనకు ముదిరాజులంతా ఐక్యం కావాలి!
Want this news as a newspaper clip?Print News Clip

మత్స్యకారుల హక్కుల సాధనకు ముదిరాజులంతా ఐక్యం కావాలి!

కొత్తగూడెంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

ఖమ్మం, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం నగరంలోని 14వ డివిజన్ కొత్తగూడెంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మత్స్యకారులు, ముదిరాజ్ మహాసభ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక సీపీఐ కొత్తగూడెం శాఖ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు జెండా ఆవిష్కరించారు.అనంతరం నిర్వహించిన సభలో రావుల హనుమంతరావు, గౌరవ అధ్యక్షులు పగడాల మల్లేష్, మాజీ కార్పొరేటర్ కొప్పెర ఉపేందర్ మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమం, ముదిరాజ్ సమాజ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మత్స్యకార కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం మరింత చేయూత అందించాలని, కులవృత్తులను కాపాడుకుంటూనే యువత విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు లింగనబోయిన లక్ష్మణ్, పగడాల అనంతరాములు, ఉద్యోగ సంఘాల అధ్యక్షులు అక్కి కోటయ్య, కార్యదర్శులు నర్రా శ్రీను, చింతల వెంకన్న, యువజన అధ్యక్షులు పొన్నెబోయిన సాయి, జిల్లా నాయకులు తిప్పట్ల నర్సింహారావు, లింగనబోయిన సతీష్, తవడబోయిన కృష్ణ, వెంగంపల్లి సురేష్, అరిగె నాగేశ్వరరావు, కుడితి సురేష్, బోనకల్ మండల అధ్యక్షులు రెడ్డెబోయిన ఉర్ధండు, మత్స్యశాఖ కార్యదర్శి పోతల నర్సింహారావు, అధ్యక్షులు మద్దరబోయిన అప్పారావు, కొత్తగూడెం అధ్యక్షులు బుడిగె వెంకన్న, కార్యదర్శి రావుల సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే! మామిడి సోమయ్య

Mudirajusuniteachieverightsfishermen

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

245 Posts

Latest News

ఇంటర్మీడియట్ విద్య విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి! గోగినపల్లి మస్తాన్ జనసేనలోకి ఖమ్మం నేత మాటేటి రవి! కేబుల్ న్యూస్ ఛానళ్ల రిపోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి! డీపీఆర్ఓకు టీజేఎఫ్ వినతి మున్సిపల్ కార్మికుల డిమాండ్లకు అధికారుల అంగీకారం! కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్య ఆశయాలను కొనసాగిస్తాం!సి.వై. పుల్లయ్య 44వ డివిజన్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై విస్తృత ప్రచారం! అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి తక్షణ నోటిఫికేషన్ ఇవ్వాలి! కోర్టు ఉత్తర్వులకే బేఖాతరా..? 85 ఏళ్ల వృద్ధురాలి ఆచూకీ ఏదీ.. వారసత్వ భూములపై మ్యుటేషన్ యత్నాలా! వైరా మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి _ షేక్ లాల్ మహమ్మద్ మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి_ సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్