10/11/2026, Tuesday · 09:25:29 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి..బడే సాహెబ్

Yakub Pasha 10/11/2026 7:29 AM రాష్ట్ర వార్తలు

ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి..బడే సాహెబ్
Want this news as a newspaper clip?Print News Clip

రెండు ఎకరాల భూమి.. రూ.3 కోట్ల నిధులు.. దూదేకుల ఆత్మగౌరవానికి ప్రభుత్వ భరోసా!

ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి.. ఎస్.కె. బడే సాహెబ్

హైదరాబాద్, నవంబర్ 10 (పీపుల్స్ వాయిస్):
 తెలంగాణ రాష్ట్ర దూదేకుల సంఘం కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రెండు ఎకరాల భూమి కేటాయించడంతో పాటు, దూదేకుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర నూర్‌భాషా సంఘం, బీసీ జేఏసీ చైర్మన్ ఎస్.కె. బడే సాహెబ్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించి, త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు.

దూదేకుల సామాజిక వర్గ అభ్యున్నతికి, ఆత్మగౌరవానికి ఈ భవనం ఎంతగానో దోహదపడుతుందని ఎస్.కె. బడే సాహెబ్ ఆకాంక్షించారు. ప్రభుత్వం కేటాయించిన భూమి, మంజూరు చేసిన నిధులు దూదేకుల సమాజానికి గొప్ప భరోసానిస్తాయని పేర్కొన్నారు. ఈ ఆత్మగౌరవ భవనం కేవలం ఒక నిర్మాణంగా కాకుండా, భవిష్యత్ తరాలకు విద్యా, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి దూదేకుల సమాజ చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని ఆయన కోరారు.

ఇది కూడా చదవండి :: 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడిపోతున్న పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా!

respect buildingRequestDeputyBhattiVikramarkacompleteconstructionself

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

196 Posts

Latest News

వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో బాలుడి హత్య! తెలంగాణ ఉద్యమానికి పాటలే ఆయుధాలు.. అందెశ్రీకి ఖమ్మం ఉద్యమకారుల ఘన నివాళి! నిరుపేద డాడీ లంబాడీలకు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించాలి కేటీఆర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రులు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయండి - భూక్య వీరభద్రం డీసీసీబీ రుణ పథకంతో ఎలక్ట్రిక్ స్కూటర్.. చింతకాని బ్రాంచ్‌లో లబ్ధిదారుడికి అందజేత 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడిపోతున్న పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా! నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. రూ.13 లక్షల స్కాం గుట్టురట్టు! డాక్టర్ కోట రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు..