21/11/2026, Saturday · 08:15:12 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

వైరా మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి _ షేక్ లాల్ మహమ్మద్

Yakub Pasha 21/11/2026 8:02 AM ఖమ్మం

వైరా మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి _ షేక్ లాల్ మహమ్మద్
Want this news as a newspaper clip?Print News Clip

వైరా మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

20 రోజులుగా వరి కోతలు జరుగుతున్నా ప్రారంభంకాని ధాన్యం కొనుగోళ్లు

వెంటనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి: మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు షేక్ లాల్ మహమ్మద్

వైరా, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

వైరా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మాజీ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ లాల్ మహమ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వైరా మండలంలో రైతులు వరి కోతలు ప్రారంభించి సుమారు 20 రోజులు గడుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించిన దాఖలాలు కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.గతంలో మాదిరిగా రైతుల నుంచి ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలించకుండా, ప్రభుత్వ గోడౌన్లకు తరలించే విధానం అమలు చేయనున్నట్లు సమాచారం వస్తోందని, ఈ కారణంగానే రైతులకు కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని, కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు చర్చించుకుంటున్నారని తెలిపారు.ప్రభుత్వం పాత విధానంలోనైనా, కొత్త విధానంలోనైనా కొనుగోళ్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే రైతులు అధిక పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గి మరింత నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయడం వల్ల రైతులకు అదనపు భారంగా మారుతుందని అన్నారు.కావున ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వైరా మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని షేక్ లాల్ మహమ్మద్ కోరారు.

ఇది కూడా చదవండి :: పత్తి చేనులో భారీ కొండచిలువ కలకలం!70 కిలోల పైతాన్‌ను సురక్షితంగా పట్టుకున్న అటవీ సిబ్బంది

Lal MohammedGrainprocurementcenterssetvillagesWyraMandal

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

236 Posts

Latest News

మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి_ సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో నారాయణ పాఠశాల విద్యార్థుల పతకాల పంట! డీఈఓ వాసంతిని మర్యాదపూర్వకంగా కలిసిన పీఆర్టీయూ టీఎస్ నాయకులు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే! మామిడి సోమయ్య పత్తి చేనులో భారీ కొండచిలువ కలకలం!70 కిలోల పైతాన్‌ను సురక్షితంగా పట్టుకున్న అటవీ సిబ్బంది ఉక్కు మహిళ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళి _ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్ ధైర్యం.. తెగువకు ప్రతీక ఝాన్సీ లక్ష్మీబాయి! ప్రభుత్వ మహిళా కళాశాలలో జయంతి వేడుకలు మా భూమి మాకు ఇవ్వండి! టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే భానోత్ చంద్రావతి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి అయ్యప్ప స్వామి విగ్రహాల వితరణ