21/11/2026, Saturday · 08:15:12 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో నారాయణ పాఠశాల విద్యార్థుల పతకాల పంట!

Yakub Pasha 21/11/2026 7:54 AM ఖమ్మం

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో నారాయణ పాఠశాల విద్యార్థుల పతకాల పంట!
Want this news as a newspaper clip?Print News Clip

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో నారాయణ పాఠశాల విద్యార్థుల పతకాల పంట!

5వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో 10 పతకాలు కైవసం

ఖమ్మం, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

5వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026 పోటీల్లో నారాయణ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 10 పతకాలు సాధించారు. నవంబర్ 15, 2026న హన్మకొండ జిల్లా కాజీపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ అక్షర హైస్కూల్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ పోటీల్లో పి. అక్షిత్, ఎం. దేవాన్ష్ రామ్, బి. దయాన అద్వైత్ బంగారు పతకాలు సాధించగా, జైత్ర యాదవ్, రిషిత, జయదేవ్, సత్య సందేశ్, కార్తికేయ, నరేన్ చౌదరి, సాయి సుదీక్ష వెండి పతకాలు సాధించారు.పతకాలు సాధించిన విద్యార్థులను ఏజీఎం రాంకీ, ఆర్.ఐ. క్రాంతి కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జి. నవీన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల విజయంపై కరాటే కోచ్ ఉపేందర్‌తో పాటు పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి :: పత్తి చేనులో భారీ కొండచిలువ కలకలం!70 కిలోల పైతాన్‌ను సురక్షితంగా పట్టుకున్న అటవీ సిబ్బంది

students winNarayanaSchoolhaulmedalsnationallevelkarate

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

236 Posts

Latest News

వైరా మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి _ షేక్ లాల్ మహమ్మద్ మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి_ సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ డీఈఓ వాసంతిని మర్యాదపూర్వకంగా కలిసిన పీఆర్టీయూ టీఎస్ నాయకులు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే! మామిడి సోమయ్య పత్తి చేనులో భారీ కొండచిలువ కలకలం!70 కిలోల పైతాన్‌ను సురక్షితంగా పట్టుకున్న అటవీ సిబ్బంది ఉక్కు మహిళ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళి _ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్ ధైర్యం.. తెగువకు ప్రతీక ఝాన్సీ లక్ష్మీబాయి! ప్రభుత్వ మహిళా కళాశాలలో జయంతి వేడుకలు మా భూమి మాకు ఇవ్వండి! టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే భానోత్ చంద్రావతి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి అయ్యప్ప స్వామి విగ్రహాల వితరణ