22/11/2026, Sunday · 02:16:06 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఇంటర్మీడియట్ విద్య విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి! గోగినపల్లి మస్తాన్

Yakub Pasha 21/11/2026 7:37 PM ఖమ్మం

ఇంటర్మీడియట్ విద్య విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి!  గోగినపల్లి మస్తాన్
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్మీడియట్ విద్య విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి!

ఉమెన్స్ కళాశాల ఎదుట PDSU నిరసన.. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్

ఖమ్మం, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ PDSU ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ఉమెన్స్ కళాశాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షులు గోగినపల్లి మస్తాన్ మాట్లాడుతూ.. విలీనం పేరుతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉనికిని, అధ్యాపకుల పోస్టులను, పేద విద్యార్థుల విద్యా అవకాశాలను దెబ్బతీయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ, పేద విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలే ప్రధాన విద్యా ఆధారమని పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, విలీన ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో PDSU జిల్లా ఉపాధ్యక్షులు గాంధీ, రాము, శ్రీకాంత్, యశ్వంత్, సాగర్, రాజశేఖర్, రోహిత్, కావ్య, లలిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే! మామిడి సోమయ్య

intermediate educationdecisionmergewithdrawnGoginapalliMastan

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

245 Posts

Latest News

జనసేనలోకి ఖమ్మం నేత మాటేటి రవి! మత్స్యకారుల హక్కుల సాధనకు ముదిరాజులంతా ఐక్యం కావాలి! కేబుల్ న్యూస్ ఛానళ్ల రిపోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి! డీపీఆర్ఓకు టీజేఎఫ్ వినతి మున్సిపల్ కార్మికుల డిమాండ్లకు అధికారుల అంగీకారం! కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్య ఆశయాలను కొనసాగిస్తాం!సి.వై. పుల్లయ్య 44వ డివిజన్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై విస్తృత ప్రచారం! అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి తక్షణ నోటిఫికేషన్ ఇవ్వాలి! కోర్టు ఉత్తర్వులకే బేఖాతరా..? 85 ఏళ్ల వృద్ధురాలి ఆచూకీ ఏదీ.. వారసత్వ భూములపై మ్యుటేషన్ యత్నాలా! వైరా మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి _ షేక్ లాల్ మహమ్మద్ మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి_ సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్