12/11/2026, Thursday · 06:34:59 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

పేదల ఇళ్లను కూల్చి.. ఇప్పుడు భూమికి ప్రహరీనా - సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్

Yakub Pasha 11/11/2026 7:31 PM ఖమ్మం

పేదల ఇళ్లను కూల్చి.. ఇప్పుడు భూమికి ప్రహరీనా - సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్
Want this news as a newspaper clip?Print News Clip

“పేదల ఇళ్లను కూల్చి.. ఇప్పుడు భూమికి ప్రహరీనా?” - సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్

ఇళ్లు కూల్చివేసిన 729 మంది పేదలకూ అక్కడే ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

కలెక్టరేట్ ఎదుట మాస్‌లైన్, ఇళ్ల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వాసితుల ఆందోళన

ఖమ్మం, నవంబర్ 11 (పీపుల్స్ వాయిస్):

వెలుగుమట్ల భూదాన భూమిలో పేదలు నిర్మించుకున్న 729 ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసిన నేపథ్యంలో, బాధితులందరికీ అదే ప్రాంతంలో ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య, కార్యవర్గ సభ్యులు ఆవుల అశోక్, ఇళ్ల స్థలాల సాధన సమితి నాయకుడు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.

భూదాన భూమిలో మిగిలిన స్థలానికి చుట్టూ ప్రహరీ నిర్మించి ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని హెచ్చరించారు. మాస్‌లైన్, ఇళ్ల స్థలాల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వాసితులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఆందోళనలో నాయకులు పాల్గొని మాట్లాడారు.భూదాన భూమిలో ఇళ్లు కూల్చివేయబడిన వారంతా నిరుపేదలేనని, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, తమకున్న కొద్దిపాటి స్థిర, చరాస్తులను అమ్ముకొని, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఇళ్లను నిర్మించుకున్నారని తెలిపారు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇళ్లలో గత ఏడేళ్లుగా నివాసం ఉంటున్న పేదలను రోడ్డున పడేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.ఇళ్ల కూల్చివేత సమయంలో బాధితులందరికీ స్థలాలు కేటాయిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అప్పటి కలెక్టర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఇప్పటికే 311 మందికి స్థలాలు కేటాయించగా, వారిలో 125 మందికి భూదాన భూమితో ఎలాంటి సంబంధం లేని వారే ఉన్నారని ఆరోపించారు. అనేక అక్రమ పద్ధతుల్లో కొందరు స్థలాలు, ఇళ్లు పొందారని విమర్శించారు.అర్హులైన బాధితులందరికీ వెలుగుమట్ల భూదాన భూమిలోనే ఇంటి స్థలాలు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు అదే భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి ఇతరులకు అప్పగించే ప్రయత్నం చేయడం తగదన్నారు. ఈ నిర్ణయాన్ని అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి అర్హులైన 729 మంది బాధితులకు న్యాయం చేయాలని, వెలుగుమట్లలోనే ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)కు అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, కొల్లేటి నాగేశ్వరరావు, బి. వెంకటేశ్వరరావు, కవిత, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య పిలుపు

Demolish HousesPoorPraharinaEarthCPIMassLine

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

198 Posts

Latest News

ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య పిలుపు వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో బాలుడి హత్య! తెలంగాణ ఉద్యమానికి పాటలే ఆయుధాలు.. అందెశ్రీకి ఖమ్మం ఉద్యమకారుల ఘన నివాళి! నిరుపేద డాడీ లంబాడీలకు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించాలి కేటీఆర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రులు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయండి - భూక్య వీరభద్రం డీసీసీబీ రుణ పథకంతో ఎలక్ట్రిక్ స్కూటర్.. చింతకాని బ్రాంచ్‌లో లబ్ధిదారుడికి అందజేత 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడిపోతున్న పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా! ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి..బడే సాహెబ్