ఆర్జేసీ కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా..నివాసానికిచేరుకుని శుభాకాంక్షలు తెలిపిన వందనం బీఆర్ఎస్ శ్రేణులు

- ఆర్జేసీ కృష్ణ నివాసంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు
- పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించిన వందనం బీఆర్ఎస్ శ్రేణులు
- ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షలు
ఆర్జేసీ కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా.. నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపిన వందనం బీఆర్ఎస్ శ్రేణులు!
చింతకాని, నవంబర్ 09 (పీపుల్స్ వాయిస్):
బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకులు ఆర్జేసీ కృష్ణ జన్మదిన వేడుకలను వందనం గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నివాసానికి చేరుకున్న వందనం గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్జేసీ కృష్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతూ ప్రజాసేవలో కొనసాగాలని నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వందనం గ్రామ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: సొంతింట్లో దీపావళి వెలుగులు.. ఇందిరమ్మ లబ్ధిదారుల కుటుంబంతో కాంగ్రెస్ నేతల సంబరాలు!












