జర్నలిస్టులకు కేటాయించిన 23 ఎకరాల ఇళ్ల స్థలాల జీఓ 147ను అమలు చేయాలి _ సివై పుల్లయ్య

జర్నలిస్టులకు కేటాయించిన 23 ఎకరాల ఇళ్ల స్థలాల జీఓ 147ను అమలు చేయాలి
ఖమ్మం కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో జర్నలిస్టుల ఆందోళనకు మద్దతు తెలిపిన సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు
ఖమ్మం, నవంబర్ 17 (పీపుల్స్ వాయిస్):
ఖమ్మం జిల్లాలో టీడబ్ల్యూజే–టీజేఎఫ్ జర్నలిస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన 23 ఎకరాల ఇళ్ల స్థలాలకు సంబంధించిన జీఓ నంబర్ 147ను తక్షణమే అమలు చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి సీ వై పుల్లయ్య డిమాండ్ చేశారు.జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ఖమ్మం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆందోళనకు సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీ వై పుల్లయ్యతో పాటు ఆవుల అశోక్, కె. శ్రీనివాస్ పాల్గొని జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లకు తమ మద్దతు ప్రకటించారు.
జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ నిరంతరం సమాజానికి సేవలందిస్తున్నారని, అలాంటి జర్నలిస్టులకు గతంలో కేటాయించిన ఇళ్ల స్థలాల హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని నాయకులు పేర్కొన్నారు. జీఓ 147ను వెంటనే అమలు చేసి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించాలని కోరారు.
ఇది కూడా చదవండి :: డిసెంబర్ 29న ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ సి వై పుల్లయ్య












