19/11/2026, Thursday · 07:36:59 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

నిరుపేదలకు అండగా వాసవి చిరు వ్యాపార సంఘం

Yakub Pasha 18/11/2026 9:03 PM ఖమ్మం

నిరుపేదలకు అండగా వాసవి చిరు వ్యాపార సంఘం
Want this news as a newspaper clip?Print News Clip

నిరుపేదలకు అండగా వాసవి చిరు వ్యాపార సంఘం

15 దుప్పట్లు విరాళంగా అందించిన వనమా ట్రస్ట్ అధినేత వనమా సూరి

 ఖమ్మం, నవంబర్ 18 (పీపుల్స్ వాయిస్)

నిరుపేదలకు చేయూతనందించే లక్ష్యంతో వాసవి చిరు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో త్వరలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సేవా కార్యక్రమానికి వనమా ట్రస్ట్ అధినేత వనమా సూరి 15 దుప్పట్లను విరాళంగా అందజేశారు.ఈ మేరకు సంఘం అధ్యక్షులు మిట్టపల్లి రవికి దుప్పట్లను అందించారు. రానున్న రోజుల్లో వీటిని అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్యవైశ్య మహాసభ మాజీ ఉపాధ్యక్షులు అనిల్, ఆర్యవైశ్య నాయకులు విన్నమూరి సుబ్బారావు, కొంకిమళ్ళ మృత్యుంజయరావు, స్వాతి హాస్పిటల్, వినాయక హాస్పిటల్ అధినేత పసుమర్తి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మిట్టపల్లి రవి మాట్లాడుతూ, నిరుపేదలకు సహాయం అందించాలనే సంకల్పంతో 15 దుప్పట్లు విరాళంగా అందించిన వనమా సూరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.నిరుపేదలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న వాసవి చిరు వ్యాపార సంఘం కృషిని పలువురు అభినందించారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో పోలీస్ చెక్‌పోస్ట్ ఏర్పాటు_ఎస్సై గజ్జల నరేష్

Business AssociationVasavisupportpoor

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

223 Posts

Latest News

గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు అరెస్ట్ _ ఎస్‌ఐ జి. నరేష్ నవంబర్ 30న ఐక్య క్రిస్మస్ ఆరాధన _ క్రైస్తవ నాయకులకు పిలుపు రవీంద్ర భారతిలో ఘనంగా టీజేఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం _ డిసెంబర్ 29న హైదరాబాద్‌లో ప్రజాగర్జనను జయప్రదం చేయండి - ఎస్.కె లాల్మియా పిలుపు చిన్న వయసులోనే హైకోర్టు న్యాయవాదిగా ప్రత్యేక గుర్తింపు వందనం గ్రామంలో ఇందిరమ్మ ‘చేయూత’ పింఛన్ పత్రాల పంపిణీ తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో పోలీస్ చెక్‌పోస్ట్ ఏర్పాటు_ఎస్సై గజ్జల నరేష్ కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి - PDSU జిల్లా సెక్రెటరీ లక్ష్మణ్ జర్నలిస్టులకు కేటాయించిన 23 ఎకరాల ఇళ్ల స్థలాల జీఓ 147ను అమలు చేయాలి _ సివై పుల్లయ్య వెలుగుమట్ల భూదాన భూమికి ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకుంటాం! మాస్ లైన్