తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల వితరణ

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల వితరణ
వందనం పాఠశాలలో 40 మంది విద్యార్థులకు వేములపల్లి కుటుంబం చేయూత
వందనం, నవంబర్ 14 (పీపుల్స్ వాయిస్):
తమ తల్లిదండ్రులైన వేములపల్లి రామకోటయ్య, అన్నపూర్ణమ్మ జ్ఞాపకార్థం వేములపల్లి సూర్యం, కనకదుర్గ (లేటు) కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వందనం గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో 40 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులను వితరణ చేశారు.విద్యార్థుల అవసరాలను గుర్తించి, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు, ఉపసర్పంచ్ అమరలపూడి శ్రీను, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వాణి, గ్రామ కార్యదర్శి అయినాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఎస్.కె మోయిన్, వార్డు సభ్యులు లకావత్ సత్యనారాయణ, ఎస్.కె అమీన్ సాహెబ్, పంతంగి వెంకన్న, వేములపల్లి సూర్యం కుమారులు హరీష్, రాము, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: నెహ్రూ జయంతి సందర్భంగా ఘన నివాళులు












