19/11/2026, Thursday · 07:37:02 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

డిసెంబర్ 29న హైదరాబాద్‌లో ప్రజాగర్జనను జయప్రదం చేయండి - ఎస్.కె లాల్మియా పిలుపు

Yakub Pasha 18/11/2026 4:03 PM ఖమ్మం

డిసెంబర్ 29న హైదరాబాద్‌లో ప్రజాగర్జనను జయప్రదం చేయండి - ఎస్.కె లాల్మియా పిలుపు
Want this news as a newspaper clip?Print News Clip

డిసెంబర్ 29న హైదరాబాద్‌లో ప్రజాగర్జనను జయప్రదం చేయండి

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై భారీ ప్రదర్శన, బహిరంగ సభ

 సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ వైరా డివిజన్ కార్యదర్శి ఎస్.కె ల్మియా పిలుపు

తల్లాడ , నవంబర్ 18 (పీపుల్స్ వాయిస్):

డిసెంబర్ 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారీ ప్రదర్శన, ప్రజాగర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ వైరా డివిజన్ కార్యదర్శి ఎస్కే లాల్మియా పిలుపునిచ్చారు. తల్లాడ మండల కేంద్రంలో నిర్వహించిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించారు.

ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని మౌలిక సమస్యలను పట్టించుకోకుండా మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ, మూఢనమ్మకాలను పెంచుతోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారి గొంతులను నొక్కుతూ నిరంకుశ పోకడలను అనుసరిస్తోందని విమర్శించారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో దేశవ్యాప్తంగా దళితులు, మైనార్టీలు, పేదలు, తమకు వ్యతిరేకంగా ఉన్న వర్గాల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. సుమారు 13 కోట్ల 40 లక్షల ఓట్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నల్లధనాన్ని వెలికితీస్తామంటూ పెద్ద నోట్ల రద్దు చేపట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని, ఆశించిన ఫలితాలు సాధించలేదని విమర్శించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలని, ఓటు చోరీని అరికట్టాలని, ఇందుకు బాధ్యులైన జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ హామీలను అమలు చేయాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని లాల్మియా డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. చౌకధరల దుకాణాల ద్వారా 12 రకాల నిత్యావసర సరుకులను సరఫరా చేయాలని, అన్ని రకాల పెన్షన్లను హామీ మేరకు పెంచి అమలు చేయాలని అన్నారు.కార్మికుల హక్కులకు భంగం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు, కార్మికులు, రైతులు, పేదల హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ప్రజాగర్జనలో ప్రజలు, కార్మికులు, రైతులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కార్యకర్తల సమావేశంలో పలువురు పాల్గొనగా..ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తల్లాడ-ఏన్కూరు సంయుక్త మండల కార్యదర్శి కె. వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి డి. శ్రీనివాసరావు, పటాన్ నాగులమీరా, ధారావతు రమణ, గొడ్ల పుల్లమ్మ, గడ్డం వెంకులు, ఎస్కే జానీ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో పోలీస్ చెక్‌పోస్ట్ ఏర్పాటు_ఎస్సై గజ్జల నరేష్

Praja GarjanasuccessHyderabadDecemberElmiyaappeal

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

223 Posts

Latest News

నిరుపేదలకు అండగా వాసవి చిరు వ్యాపార సంఘం గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు అరెస్ట్ _ ఎస్‌ఐ జి. నరేష్ నవంబర్ 30న ఐక్య క్రిస్మస్ ఆరాధన _ క్రైస్తవ నాయకులకు పిలుపు రవీంద్ర భారతిలో ఘనంగా టీజేఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం _ చిన్న వయసులోనే హైకోర్టు న్యాయవాదిగా ప్రత్యేక గుర్తింపు వందనం గ్రామంలో ఇందిరమ్మ ‘చేయూత’ పింఛన్ పత్రాల పంపిణీ తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో పోలీస్ చెక్‌పోస్ట్ ఏర్పాటు_ఎస్సై గజ్జల నరేష్ కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి - PDSU జిల్లా సెక్రెటరీ లక్ష్మణ్ జర్నలిస్టులకు కేటాయించిన 23 ఎకరాల ఇళ్ల స్థలాల జీఓ 147ను అమలు చేయాలి _ సివై పుల్లయ్య వెలుగుమట్ల భూదాన భూమికి ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకుంటాం! మాస్ లైన్