తోటి మెకానిక్ కుటుంబానికి అండగా త్రీ టౌన్ మెకానిక్ సోదరులు!

తోటి మెకానిక్ కుటుంబానికి అండగా త్రీ టౌన్ మెకానిక్ సోదరులు!
తోట జగదీష్ దశదిన కర్మల సందర్భంగా రూ.20,111 ఆర్థిక సాయం
ఆపదలో ఉన్న ప్రతి మెకానిక్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
ఖమ్మం, నవంబర్ 19 (పీపుల్స్ వాయిస్):
తోటి వృత్తి సోదరుడి కుటుంబం విషాదంలో ఉన్న వేళ అండగా నిలిచి త్రీ టౌన్ మెకానిక్ సోదరులు మానవత్వం, సోదరభావాన్ని చాటుకున్నారు. బైక్ మెకానిక్ తోట జగదీష్ దశదిన కర్మల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.20,111 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
తోటి మెకానిక్ కుటుంబానికి కష్టకాలంలో ఆర్థిక సహాయం అందించడం ద్వారా తమ మధ్య ఉన్న వృత్తి అనుబంధం, ఆత్మీయతను చాటుకున్నారు. మెకానిక్ సోదరుల ఐక్యత, సేవాభావం, మానవత్వంతో కూడిన ఈ సహాయ కార్యక్రమంపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మెకానిక్ సోదరులు మాట్లాడుతూ.. తమలో ఎవరైనా ఆపదలో ఉన్నా, కుటుంబంలో కష్టాలు ఎదురైనా అందరం ఐక్యంగా నిలబడి ఆదుకుంటామని తెలిపారు. ఏ మెకానిక్ సోదరుడినీ కష్టకాలంలో ఒంటరిగా వదిలిపెట్టబోమని భరోసా ఇచ్చారు. వృత్తిపరమైన అనుబంధానికే పరిమితం కాకుండా కుటుంబ సభ్యుల్లా ఒకరికొకరు అండగా నిలవడమే తమ ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ మెకానిక్ హమీద్ భాయ్, వీరేష్, ఎర్రోజు నరేష్, పి. నరసింహారావు, తూము సత్యం, వేల్పుల మహేష్, నూక కరుణాకర్, ఎస్.కె. మీరా, ఎం. రామాచారి, ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: నిరుపేదలకు అండగా వాసవి చిరు వ్యాపార సంఘం












