07/11/2026, Saturday · 09:27:16 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఆపదలో ప్రజల మధ్యకు.. బాధ్యతలో ముందంజ.. కలెక్టర్‌కు జర్నలిస్టుల ఘన సత్కారం!

Yakub Pasha 07/11/2026 7:50 AM ఖమ్మం

ఆపదలో ప్రజల మధ్యకు.. బాధ్యతలో ముందంజ.. కలెక్టర్‌కు జర్నలిస్టుల ఘన సత్కారం!
Want this news as a newspaper clip?Print News Clip

ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యత.. వరదల్లో క్షేత్రస్థాయిలో కలెక్టర్ సేవలు అభినందనీయం!

బేతుపల్లి ఘటనలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన కలెక్టర్ దివాకర్ టీ.ఎస్.కు TWJF ఘన సన్మానం

ఖమ్మం, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):

అధికారం అంటే కేవలం హోదా కాదు.. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడమే అసలైన బాధ్యత. బేతుపల్లి చెరువు వరదల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టిన ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీ.ఎస్. సేవలను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) ఖమ్మం జిల్లా కమిటీ ప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నానబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అర్వపల్లి నగేష్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు.బేతుపల్లి చెరువు ఘటన నేపథ్యంలో కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, గత రెండు రోజులుగా విశ్రాంతి లేకుండా భద్రతా చర్యలను పర్యవేక్షించడం, వివిధ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టడం అభినందనీయమని జర్నలిస్టు నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలపై ప్రత్యేక దృష్టి సారించడం బాధ్యతాయుతమైన పాలనకు నిదర్శనమని కొనియాడారు.ఈ సందర్భంగా TWJF నాయకులు మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం స్పందించే తీరు ప్రజలకు కొండంత భరోసానిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయికి చేరుకుని వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రాణరక్షణ చర్యలకు ప్రాధాన్యతనివ్వడం నిజమైన ప్రజాసేవకు నిదర్శనమన్నారు. పదవులు హోదాను అందిస్తాయని, ప్రజల కోసం చేసే సేవలే సమాజంలో గౌరవాన్ని సంపాదించి పెడతాయని అన్నారు.సన్మానానికి స్పందించిన కలెక్టర్ దివాకర్ టీ.ఎస్. TWJF జిల్లా కమిటీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని, బేతుపల్లి ఘటనను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

బేతుపల్లి ఘటనలో జిల్లా కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి (DPRO) గౌస్ పాషా చూపిన చొరవ, సమన్వయం ప్రజల్లో అధికార యంత్రాంగంపై నమ్మకాన్ని మరింత పెంచాయని TWJF ప్రతినిధులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో TWJF జిల్లా అధ్యక్షుడు నానబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అర్వపల్లి నగేష్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు ఎలుగోటి వెంకట్, కప్పల మధు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు బంక మన్మధరావు, మామిడాల వీరబాబు, జిల్లా ఉపాధ్యక్షులు లింగాల రామ్మూర్తి, చిన్నంశెట్టి రాంబాబు, పామర్తి నాగేశ్వరరావు, మల్లెబోయిన లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు!

responsibilityAmongpeopledistressfrontrunnertributejournalistscollector

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

179 Posts

Latest News

ప్రమాదంలో గాయపడిన ఎన్‌టీవీ కెమెరామెన్ భార్యకు టీజేఎఫ్ ఆర్థిక సాయం అష్రఫ్, మహ్మద్ రఫీలకు ఎంపీ వద్దిరాజు ఆశీస్సులు ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసిందేమిటో చెప్పాలి! వద్దిరాజు రవిచంద్ర పందిళ్ళపల్లిలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు! వ్యభిచార గృహంపై ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ మెరుపు దాడి.. ముగ్గురు మహిళలకు విముక్తి! పేద విద్యార్థిని చదువుకు "గోపా" అండ.. రూ.64 వేల ఆర్థిక సాయం! బాలపేట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఐదుగురు పట్టివేత! పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు! కరువు కోరల్లో కామేపల్లి రైతాంగం.. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి! ఎన్.వి. రాకేష్ పకీర్ సాహెబ్ పోరాట ఫలితం.. దూదేకుల భవనానికి రూ.3 కోట్లు!