07/11/2026, Saturday · 09:27:17 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసిందేమిటో చెప్పాలి! వద్దిరాజు రవిచంద్ర

Yakub Pasha 07/11/2026 6:21 PM ఖమ్మం

ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసిందేమిటో చెప్పాలి! వద్దిరాజు రవిచంద్ర
Want this news as a newspaper clip?Print News Clip
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మంత్రులు చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
  • 50 వేల ఎకరాలకు పైగా పంట నష్టంపై సమగ్ర సర్వే చేసి పరిహారం చెల్లించాలి
  • రూ.20.04 లక్షలతో కాదు.. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
  • పెద్దవాగు ప్రాజెక్టు, రహదారులు, కల్వర్టుల మరమ్మతులు వేగవంతం చేయాలి
  • తుపాను బాధిత రైతులకు తక్షణమే పరిహారం అందించాలి

ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసిందేమిటో చెప్పాలి!

మంత్రుల పనితీరుపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్

ఖమ్మం, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమిటో, తీసుకొచ్చిన నిధులెన్నో ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై మంత్రుల పనితీరును వివరిస్తూ వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. మురసు తుపాను కారణంగా పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.శనివారం ఖమ్మం తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, పార్టీ నాయకులు బమ్మెర రాంమూర్తి, బెల్లం వేణు, సుబ్బారావు తదితరులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ రవిచంద్ర మాట్లాడారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ, విపత్తుల నివారణ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. ప్రతి చిన్న పనికి హెలికాప్టర్‌లో వచ్చి హడావుడి చేసే మంత్రులు జిల్లా అభివృద్ధిని మాత్రం పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లుగా ఉన్న నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎన్ని నిధులు కేటాయించారు? ఎంతమేర నిధులు తీసుకొచ్చారు? ఎంత ఖర్చు చేశారు? ఎన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశారు? అనే వివరాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.మురసు తుపాను కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరి, మిర్చి, పత్తి, ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 50 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. తక్షణమే సమగ్ర పంట నష్టం సర్వే నిర్వహించి రైతులకు తగిన పరిహారం అందించాలని కోరారు. రైతులను ఆదుకోవాల్సిన మూడు ప్రధాన శాఖలు మంత్రుల వద్దే ఉన్నప్పటికీ నష్టపరిహారం విషయంలో నిర్లక్ష్యం, జాప్యం చేయడం బాధాకరమన్నారు.గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరదల వల్ల పంటలు కోల్పోయిన రైతులను స్వయంగా పరామర్శించి తక్షణమే నష్టపరిహారం అందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొనగా, మరోవైపు తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి ముగ్గురు మంత్రులు, అధికార యంత్రాంగంతో కలిసి కొడంగల్ నియోజకవర్గానికే పరిమితం కావడాన్ని విమర్శించారు.గతంలో వచ్చిన వరదలకు దెబ్బతిన్న పెద్దవాగు ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో తాజా తుపాను కారణంగా ప్రాజెక్టు మరింతగా దెబ్బతిన్నదని తెలిపారు. పంటల బీమా సౌకర్యం ఉన్నా లేకపోయినా పంటలు కోల్పోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్దవాగు ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో పాటు దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇది కూడా చదవండి :: పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు!

Vaddiraju RavichandraTellministerscommonKhammamdistrict

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

179 Posts

Latest News

ప్రమాదంలో గాయపడిన ఎన్‌టీవీ కెమెరామెన్ భార్యకు టీజేఎఫ్ ఆర్థిక సాయం అష్రఫ్, మహ్మద్ రఫీలకు ఎంపీ వద్దిరాజు ఆశీస్సులు పందిళ్ళపల్లిలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు! వ్యభిచార గృహంపై ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ మెరుపు దాడి.. ముగ్గురు మహిళలకు విముక్తి! పేద విద్యార్థిని చదువుకు "గోపా" అండ.. రూ.64 వేల ఆర్థిక సాయం! బాలపేట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఐదుగురు పట్టివేత! పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు! కరువు కోరల్లో కామేపల్లి రైతాంగం.. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి! ఎన్.వి. రాకేష్ పకీర్ సాహెబ్ పోరాట ఫలితం.. దూదేకుల భవనానికి రూ.3 కోట్లు! ఆపదలో ప్రజల మధ్యకు.. బాధ్యతలో ముందంజ.. కలెక్టర్‌కు జర్నలిస్టుల ఘన సత్కారం!