అష్రఫ్, మహ్మద్ రఫీలకు ఎంపీ వద్దిరాజు ఆశీస్సులు

అష్రఫ్, మహ్మద్ రఫీలకు ఎంపీ వద్దిరాజు ఆశీస్సులు
ఖమ్మంలో జరిగిన వివాహ విందుకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ ప్రముఖులు
ఖమ్మం, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నూతన వధూవరులు అష్రఫ్, మహ్మద్ రఫీలను ఆశీర్వదించారు.సూర్యాపేట మాజీ జెడ్పీటీసీ భాషా కుమార్తె అష్రఫ్, మహ్మద్ రఫీల వివాహం అనంతరం శనివారం ఖమ్మం మామిళ్లగూడెంలోని వీవీసీ ఫంక్షన్ హాలులో వివాహ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, వెంకట నారాయణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు.
ఇది కూడా చదవండి :: పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు!












