ప్రమాదంలో గాయపడిన ఎన్‌టీవీ కెమెరామెన్ భార్యకు టీజేఎఫ్ ఆర్థిక సాయం

ప్రమాదంలో గాయపడిన ఎన్‌టీవీ కెమెరామెన్ భార్యకు టీజేఎఫ్ ఆర్థిక సాయం
వడ్డే చైతన్యను పరామర్శించిన జర్నలిస్టు సంఘం నేతలు.. రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత
ఖమ్మం, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్‌టీవీ సీనియర్ కెమెరామెన్ వడ్డే పృథ్వి సతీమణి వడ్డే చైతన్య ఇటీవల ఖమ్మం బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–టీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, జాతీయ కౌన్సిల్ సభ్యుడు వెన్నబోయిన సాంబశివరావుతో కూడిన జర్నలిస్టుల బృందం శనివారం ఆమెను పరామర్శించింది.ఖమ్మం కరుణగిరి సమీపంలోని సప్తగిరి ప్రాంతంలో ఉన్న వడ్డే పృథ్వి నివాసానికి వెళ్లిన జర్నలిస్టు నాయకులు చైతన్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పృథ్విని అడిగి తెలుసుకుని, కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. టీయూడబ్ల్యూజే–టీజేఎఫ్ జర్నలిస్టు యూనియన్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చైతన్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–టీజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు వెన్నబోయిన సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు మందుల ఉపేందర్, వనం నాగయ్య, కలువకోలను హరీష్ రాజ్, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి రమేష్ బాబు, కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, కె.వి. సతీష్, నాగేశ్వరరావు, నాగేంద్రబాబు, సుధాకర్, హైమాద్, మోహన్, శివకృష్ణ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు!












