14/11/2026, Saturday · 05:28:01 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

తీన్మార్ మల్లన్న పాదయాత్రపై లారీ దూసుకొచ్చిన ఘటనను ఖండించిన టీఆర్పీ

Yakub Pasha 13/11/2026 6:57 PM ఖమ్మం

తీన్మార్ మల్లన్న పాదయాత్రపై లారీ దూసుకొచ్చిన ఘటనను ఖండించిన టీఆర్పీ
Want this news as a newspaper clip?Print News Clip

తీన్మార్ మల్లన్న పాదయాత్రపై లారీ దూసుకొచ్చిన ఘటనను ఖండించిన టీఆర్పీ

నిందితులను వెంటనే అరెస్టు చేయాలి

ఘటన వెనుక కుట్ర కోణాన్ని నిగ్గుతేల్చాలి

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుంటే సీఎం రాజీనామా చేయాలి: టీఆర్పీ ఖమ్మం జిల్లా నేతల డిమాండ్

ఖమ్మం, నవంబర్ 13 (పీపుల్స్ వాయిస్):

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన ప్రజా పాదయాత్రపై లారీ దూసుకొచ్చిన ఘటనను తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఖమ్మం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. మోత్కూరు సమీపంలోని మాలగిరి ప్రాంతంలో పాదయాత్ర కొనసాగుతుండగా వేగంగా వచ్చిన లారీ యాత్రలోని వాహనాన్ని, కారును ఢీకొట్టడంతో ఐదారుగురు తీవ్రంగా గాయపడినట్లు పార్టీ నాయకులు వెల్లడించారు.ఈ ఘటనపై జిల్లా ఇన్‌చార్జ్ గట్ల రాజన్న, జిల్లా అధ్యక్షుడు దామల సత్యం మాట్లాడుతూ.. బహుజనుల హక్కుల సాధన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న తీన్మార్ మల్లన్న పాదయాత్రలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకరమన్నారు.

ఇది సాధారణ ప్రమాదమా? లేక దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఘటన వెనుక ఎంతటి పెద్ద వ్యక్తులు ఉన్నా, ఏ రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న బహుజన నాయకులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను, ప్రజా పోరాటాలను భౌతిక దాడులతో అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై చిత్తశుద్ధితో స్పందించి ప్రత్యేక దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ గట్ల రాజన్న, జిల్లా అధ్యక్షుడు దామల సత్యం, జిల్లా ఉపాధ్యక్షుడు పెరమలపల్లి నాగార్జున, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు తేలపుట్ట జగపతి, టౌన్ అధ్యక్షుడు కొప్పుల రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలోజు వినయ్, టౌన్ ప్రధాన కార్యదర్శి కేతవరపు లెనిన్ పాల్గొన్నారు.అలాగే మానవ హక్కుల పరిరక్షణ సమితి చైర్మన్ చలమల హైమావతి, కిరణ్మయి, అనిత, మాధవి, సాయి, సైదులు, చారి తదితరులు ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పలువురు నూతనంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణ డీజీపీకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు

TRP condemnsincidentlorryrammingTeenmaarMallannapadayatra

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

204 Posts

Latest News

తెలంగాణ డీజీపీకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ సీ.వై. పుల్లయ్య కామన్ స్కూల్ విధానమే సామాజిక సమానత్వానికి పునాది! ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ సి.వై. పుల్లయ్య పిలుపు బొమ్మెర రామ్మూర్తికి ఘన సత్కారం.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచులు ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య పిలుపు పేదల ఇళ్లను కూల్చి.. ఇప్పుడు భూమికి ప్రహరీనా - సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో బాలుడి హత్య! తెలంగాణ ఉద్యమానికి పాటలే ఆయుధాలు.. అందెశ్రీకి ఖమ్మం ఉద్యమకారుల ఘన నివాళి! నిరుపేద డాడీ లంబాడీలకు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించాలి