04/11/2026, Wednesday · 08:21:24 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

జలకళ సంతరించుకున్న లంకాసాగర్.. గంగమ్మకు ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక పూజలు!

Yakub Pasha 04/11/2026 6:32 PM ఖమ్మం

జలకళ సంతరించుకున్న లంకాసాగర్.. గంగమ్మకు ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక పూజలు!
Want this news as a newspaper clip?Print News Clip

జలకళ సంతరించుకున్న లంకాసాగర్.. గంగమ్మకు ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక పూజలు!

రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగాలి.. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థన

పెనుబల్లి, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):

పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండిన సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రాజెక్ట్ వద్ద గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాదేవికి పూలు, వస్త్రాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లంకాసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండటం రైతులకు, ప్రజలకు ఎంతో ఆనందదాయకమైన విషయమని అన్నారు. జలవనరులు సమృద్ధిగా ఉండటం ప్రాంత అభివృద్ధికి, వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గంగాదేవిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన్ కమల్ పాషా, కల్లూరు ఏఎంసీ వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

special poojaMLARamgamaiGangamma

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

153 Posts

Latest News

మురసు తుఫాన్‌తో నీట మునిగిన వరి పొలాలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి! న్యాయమూర్తి జయరాజు మాతృమూర్తి రోజానమ్మకు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి బీసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదు.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లాస్యశ్రీ వైద్యానికి ఎంపీ వద్దిరాజు రూ.2 లక్షల ఎల్‌వోసీ అందజేత! అవినీతి అధికారిపై సస్పెన్షన్ వేటు.. ముదిరాజ్ సమాజంలో హర్షాతిరేకాలు! అన్‌ఫిట్ గురుకులాలను అధికారులు సందర్శించాలి _ తిప్పారపు లక్ష్మణ్ డిమాండ్ మురసు తుఫాన్‌ బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి_సి.వై. పుల్లయ్య డిమాండ్ జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని