04/11/2026, Wednesday · 07:27:18 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

బీసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదు.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర

Yakub Pasha 04/11/2026 6:14 PM ఖమ్మం

బీసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదు.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర
Want this news as a newspaper clip?Print News Clip

బీసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదు.. హక్కుల సాధనకు బీఆర్ఎస్ పోరాటం!

జీవో 14ను తక్షణమే ఉపసంహరించుకోవాలి.. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు

ఖమ్మం, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):

దేశ జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాలతో పాటు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల న్యాయమైన హక్కుల సాధనకు, రాజ్యాధికారంలో సముచిత స్థానం కల్పించేందుకు, వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకు బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 14 బీసీ కుల సంఘాల హక్కులను కాలరాసే విధంగా ఉందని, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తోందని ఒక ప్రకటనలో ఎంపీ పేర్కొన్నారు. బీసీ కుల సంఘాల ట్రస్టులను రద్దు చేసి, కోకాపేటలో కేటాయించిన విలువైన భూములపై ప్రభుత్వ పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 41 బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కోకాపేటలో 82 ఎకరాల విలువైన భూములను కేటాయించారని గుర్తు చేశారు. ఆయా కుల సంఘాల స్వయంప్రతిపత్తిని కాపాడేందుకు ట్రస్టులు ఏర్పాటు చేయించారని తెలిపారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 14 ద్వారా కుల సంఘాల ట్రస్టులను పక్కనపెట్టి భవన నిర్మాణ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా వాటిపై ప్రభుత్వ నియంత్రణ పెంచేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఏదీ?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని ఎంపీ రవిచంద్ర విమర్శించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోవడం, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం, కులగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్ లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో మున్నూరుకాపు, యాదవ, కుర్మ, పద్మశాలి, చాకలి, మంగలి తదితర బీసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్ని ప్రశ్నించారు.కేసీఆర్ పాలనలో బీసీలకు సముచిత గౌరవం, రాజకీయ ప్రాధాన్యత లభించాయని పేర్కొన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు. మధుసూదనాచారిని తొలి అసెంబ్లీ స్పీకర్‌గా, స్వామిగౌడ్‌ను శాసనమండలి ఛైర్మన్‌గా నియమించడంతో పాటు జోగు రామన్న, గంగుల కమలాకర్, పద్మారావు గౌడ్, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులకు మంత్రి పదవులు ఇచ్చి బీసీలకు ప్రాధాన్యత కల్పించారని వివరించారు. బొంతు రామ్మోహన్, గద్వాల విజయలక్ష్మీలకు హైదరాబాద్ నగర మేయర్లుగా అవకాశం కల్పించారని తెలిపారు.తనతో పాటు కే. కేశవరావు, డి. శ్రీనివాస్, బండా ప్రకాష్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్‌లను రాజ్యసభకు పంపించి బీసీ నాయకత్వానికి కేసీఆర్ గౌరవం కల్పించారని పేర్కొన్నారు.

బీసీ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి

కుటుంబ సర్వేలో బీసీల జనాభాను తక్కువగా చూపించారని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు అన్యాయం జరిగిందని ఎంపీ ఆరోపించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన 56 హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల సామాజిక నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

బీసీ కుల సంఘాల స్వేచ్ఛకు, ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఉన్న జీవో 14ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. నకిలీ హామీలు కాకుండా బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో న్యాయమైన వాటా కల్పించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీల పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఆయన విమర్శించారు.బీసీల హక్కుల పరిరక్షణ, రాజ్యాధికారంలో సముచిత వాటా, కుల సంఘాల స్వయంప్రతిపత్తి, ఆత్మగౌరవ భవనాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Vaddiraju RavichandrarightsBCstoleratedcollapseRajyaSabhamember

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

153 Posts

Latest News

జలకళ సంతరించుకున్న లంకాసాగర్.. గంగమ్మకు ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక పూజలు! మురసు తుఫాన్‌తో నీట మునిగిన వరి పొలాలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి! న్యాయమూర్తి జయరాజు మాతృమూర్తి రోజానమ్మకు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి లాస్యశ్రీ వైద్యానికి ఎంపీ వద్దిరాజు రూ.2 లక్షల ఎల్‌వోసీ అందజేత! అవినీతి అధికారిపై సస్పెన్షన్ వేటు.. ముదిరాజ్ సమాజంలో హర్షాతిరేకాలు! అన్‌ఫిట్ గురుకులాలను అధికారులు సందర్శించాలి _ తిప్పారపు లక్ష్మణ్ డిమాండ్ మురసు తుఫాన్‌ బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి_సి.వై. పుల్లయ్య డిమాండ్ జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని