04/11/2026, Wednesday · 07:28:39 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

అవినీతి అధికారిపై సస్పెన్షన్ వేటు.. ముదిరాజ్ సమాజంలో హర్షాతిరేకాలు!

Yakub Pasha 04/11/2026 5:32 PM ఖమ్మం

అవినీతి అధికారిపై సస్పెన్షన్ వేటు.. ముదిరాజ్ సమాజంలో హర్షాతిరేకాలు!
Want this news as a newspaper clip?Print News Clip
  • నకిలీ జీవోలు, బోగస్ సభ్యత్వాలపై సమగ్ర విచారణ జరపాలి
  • అక్రమ సభ్యత్వాలు రద్దు చేసి నిజమైన మత్స్యకారులకు చెరువుల హక్కులు కల్పించాలి

అవినీతి అధికారిపై సస్పెన్షన్ వేటు.. ముదిరాజ్ సమాజంలో హర్షాతిరేకాలు!

ఖమ్మం, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):

మత్స్యశాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఆంజనేయ స్వామిని ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై రాష్ట్ర, జిల్లా ముదిరాజ్ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా ముదిరాజ్ కులస్థులు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చోప్పరి శంకర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు నిర్వహించిన అత్యవసర విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడారు.

నకిలీ జీవోలు.. బోగస్ సభ్యత్వాలపై ఆరోపణలు

ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ.. సస్పెండ్ అయిన అధికారి జిల్లా వ్యాప్తంగా వందలాది నకిలీ సభ్యత్వాలు సృష్టించి, అర్హతలేని వారికి చెరువుల కేటాయింపులు జరిపినట్లు ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వులను సైతం ఫోర్జరీ చేసి, బోగస్ ప్రొసీడింగ్స్ తయారు చేసినట్లు విమర్శించారు. ఈ అక్రమాల కారణంగా సంప్రదాయ మత్స్యవృత్తిపై ఆధారపడిన నిజమైన ముదిరాజ్ మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీల మధ్య వివాదాలు సృష్టించి పేద మత్స్యకారుల జీవనోపాధికి ఆటంకం కలిగించారని ఆరోపించారు.

ప్రభుత్వ నిర్ణయంపై కృతజ్ఞతలు

మత్స్యకారుల ఫిర్యాదులను పరిశీలించి తక్షణమే స్పందించి సస్పెన్షన్ చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి ముదిరాజ్ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, మత్స్యశాఖ మంత్రి, ఖమ్మం జిల్లా మంత్రులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మత్స్యశాఖ ఇన్‌చార్జి వాకిటి శ్రీహరి, ఆ శాఖ కమిషనర్, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.

బోగస్ సభ్యత్వాలు రద్దు చేయాలి

సస్పెన్షన్‌తోనే సమస్య పరిష్కారం కాదని, సంబంధిత అధికారి హయాంలో జిల్లా వ్యాప్తంగా సృష్టించిన నకిలీ జీవోలు, బోగస్ సభ్యత్వాలపై సమగ్ర విచారణ జరిపి వాటిని పూర్తిగా రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. స్క్రీనింగ్ కమిటీ ద్వారా నిజమైన మత్స్యకారులను గుర్తించి వారికే చెరువులపై హక్కులు కల్పించాలని కోరారు. ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేసినట్లు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అక్రమ ఆస్తులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పేద మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలిగించే అక్రమాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోప్పెర వెంకట నరసయ్య ముదిరాజ్, ఉపాధ్యక్షులు ప్రతానపు వెంకటేశ్వర్లు ముదిరాజ్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు కొప్పెర జానకిరాములు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి కొమ్ము భాస్కర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు, మత్స్యశాఖ కన్వీనర్ బొమ్మకంటి సైదులు ముదిరాజ్, చింతనబోయిన సీతారాములు ముదిరాజ్, దంతాల కేశవులు ముదిరాజ్, గొడుగు నాగేశ్వరరావు, బండారి శ్రీను, కోశాధికారి ఓర వెంకటేశ్వర్లు, కార్యదర్శులు పందుల ఉపేందర్, చామకూరి నాగేశ్వరరావు, గోగుల శ్రీను, నర్ల శేషయ్య, కోమట్లగూడెం మత్స్యపారిశ్రామిక సంఘం అధ్యక్షుడు పిట్టల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు బుడిగె వెంకటేశ్వర్లు, అడపా ప్రవీణ్, వివిధ మండలాల ప్రతినిధులు, బాధిత మత్స్యకార సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

anti happinessSuspensioncorruptofficialMudirajcommunity

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

153 Posts

Latest News

జలకళ సంతరించుకున్న లంకాసాగర్.. గంగమ్మకు ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక పూజలు! మురసు తుఫాన్‌తో నీట మునిగిన వరి పొలాలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి! న్యాయమూర్తి జయరాజు మాతృమూర్తి రోజానమ్మకు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి బీసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదు.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లాస్యశ్రీ వైద్యానికి ఎంపీ వద్దిరాజు రూ.2 లక్షల ఎల్‌వోసీ అందజేత! అన్‌ఫిట్ గురుకులాలను అధికారులు సందర్శించాలి _ తిప్పారపు లక్ష్మణ్ డిమాండ్ మురసు తుఫాన్‌ బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి_సి.వై. పుల్లయ్య డిమాండ్ జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని