న్యాయమూర్తి జయరాజు మాతృమూర్తి రోజానమ్మకు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి

న్యాయమూర్తి జయరాజు మాతృమూర్తి రోజానమ్మకు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి
తల్లాడ, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):
తల్లాడ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు న్యాయమూర్తి అంగిడి జయరాజు మాతృమూర్తి అంగిడి రోజానమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో నారాయణపురంలోని జీఎన్ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన ఆమె దశదిన కర్మ కార్యక్రమానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రోజానమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం న్యాయమూర్తి అంగిడి జయరాజుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాతృమూర్తిని కోల్పోవడం తీరని లోటని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొడ్డు వెంకటేశ్వరరావు (బీవీఆర్), మర్సకట్ల బాబురావు, ఖమ్మం జిల్లా కోర్టు అడ్వకేట్ తొండపు వెంకటేశ్వర్లు, గొడుగునూరు శ్రీనివాసరెడ్డి, సీతారామరెడ్డి, ముకర ప్రసాద్, వెంకట నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని












