16/11/2026, Monday · 05:28:39 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

అర్హులందరికీ రాజీవ్ యువ వికాస పథకం అమలు చేయాలి! ఎన్.వి. రాకేష్

Yakub Pasha 15/11/2026 7:49 PM ఖమ్మం

అర్హులందరికీ రాజీవ్ యువ వికాస పథకం అమలు చేయాలి! ఎన్.వి. రాకేష్
Want this news as a newspaper clip?Print News Clip

అర్హులందరికీ రాజీవ్ యువ వికాస పథకం అమలు చేయాలి!

ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి

జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి – పి.వై.ఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వి. రాకేష్

ఖమ్మం, నవంబర్ 15 (పీపుల్స్ వాయిస్):
రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ పథకాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ప్రగతిశీల యువజన సంఘం (పి.వై.ఎల్) రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వి. రాకేష్ డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జిల్లా అధ్యక్షులు ప్రేమ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన పి.వై.ఎల్ ఖమ్మం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన, జిల్లా కార్యదర్శి జక్కుల భరత్ మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకున్నారని, ప్రభుత్వం నిర్దేశించిన పరిమిత లక్ష్యాల కారణంగా అనేకమంది అర్హులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం అదనపు బడ్జెట్ కేటాయించి అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు, సబ్సిడీలు అందించాలని కోరారు. ఎంపిక ప్రక్రియలో రాజకీయ జోక్యం, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్రతరమవుతోందని, ఉన్నత చదువులు పూర్తి చేసిన లక్షలాది మంది యువత ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను శాఖల వారీగా ప్రకటించి, తక్షణమే నియామకాలు చేపట్టాలని కోరారు. నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేలా స్పష్టమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ప్రతి సంవత్సరం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ యువతకు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి అందించాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి అవసరమైన ఆర్థిక సహాయం, రుణాలు, సబ్సిడీలు సకాలంలో అందించాలని సూచించారు.యువతకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, రాజీవ్ యువ వికాస పథకం ద్వారా అర్హులందరికీ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో నిరుద్యోగ యువతను ఏకం చేసి పి.వై.ఎల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బలమైన ఉద్యమాలు చేపడతామని ఎన్.వి. రాకేష్, జక్కుల భరత్ హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్. ధరణి కృష్ణ, నాయకులు తోట రమేష్, మామిడాల వెంకటేష్, పరికపల్లి మధు, కొత్త రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: ఎంపీ వద్దిరాజుకు చెరుకూరి వారి తోటలో మున్నూరుకాపుల అపూర్వ స్వాగతం!

Vikas YojanaRajivYuvaimplementedeligibleindividuals

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

209 Posts

Latest News

ఎంపీ వద్దిరాజుకు చెరుకూరి వారి తోటలో మున్నూరుకాపుల అపూర్వ స్వాగతం! నెహ్రూ జయంతి సందర్భంగా ఘన నివాళులు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు కలెక్టరేట్ ఎదుట ధర్నా _ టీజేఎఫ్ పిలుపు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల వితరణ తెలంగాణ డీజీపీకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ సీ.వై. పుల్లయ్య కామన్ స్కూల్ విధానమే సామాజిక సమానత్వానికి పునాది! తీన్మార్ మల్లన్న పాదయాత్రపై లారీ దూసుకొచ్చిన ఘటనను ఖండించిన టీఆర్పీ ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ సి.వై. పుల్లయ్య పిలుపు బొమ్మెర రామ్మూర్తికి ఘన సత్కారం.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచులు