పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి అయ్యప్ప స్వామి విగ్రహాల వితరణ

పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి అయ్యప్ప స్వామి విగ్రహాల వితరణ
గణపతి, సుబ్రహ్మణ్య స్వామి సమేత అయ్యప్ప స్వామి విగ్రహాలను అందజేసిన తోడేటి వీరభద్రం దంపతులు
దాతల కుటుంబానికి ఆలయ కమిటీ కృతజ్ఞతలు
ఖమ్మం, నవంబర్ 19 (పీపుల్స్ వాయిస్):
ఖమ్మం జిల్లా లక్ష్మీపురం, వెంకటగిరి గ్రామాల మధ్య వెలసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెంకటగిరి గ్రామానికి చెందిన తోడేటి వీరభద్రం, శైలజ దంపతులు భక్తిశ్రద్ధలతో విగ్రహాలను వితరణగా అందజేశారు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి సమేత అయ్యప్ప స్వామి విగ్రహాలను ఆలయానికి సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు రాజాచార్యుల చేతుల మీదుగా విగ్రహాలను ఆలయానికి సమర్పించారు. భక్తిశ్రద్ధలతో విగ్రహాలను వితరణగా అందించిన తోడేటి వీరభద్రం, శైలజ దంపతుల సేవను ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. దాతల కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.స్వామివారి కృపాకటాక్షాలు తోడేటి వీరభద్రం, శైలజ, వినయ్ బాబు, హేమశ్రీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి :: తోటి మెకానిక్ కుటుంబానికి అండగా త్రీ టౌన్ మెకానిక్ సోదరులు!












