20/11/2026, Friday · 12:57:58 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే భానోత్ చంద్రావతి

Yakub Pasha 19/11/2026 8:57 PM ఖమ్మం

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే భానోత్ చంద్రావతి
Want this news as a newspaper clip?Print News Clip

గాంధీనగర్ కాలనీలో ఘనంగా వివాహ వేడుక

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే భానోత్ చంద్రావతి

 కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రుల సందడి

చింతకాని, నవంబర్ 19 (పీపుల్స్ వాయిస్):
చింతకాని మండల పరిధిలోని గాంధీనగర్ కాలనీలో కోసూరి వీరబాబు – లలిత దంపతుల కుటుంబంలో వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. వారి కుమారుడు వెంకట సాయి గౌడ్, ఉమా గౌడ్‌ల వివాహం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఇంటి ఆవరణలో వైభవంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు వైరా మాజీ ఎమ్మెల్యే భానోత్ చంద్రావతి, తిరుమలాపురం గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు, బొప్పారం గ్రామ సర్పంచ్ షేక్ రహమతుల్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన వధూవరులను పూలమాలలతో అభినందించి, అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి :: తోటి మెకానిక్ కుటుంబానికి అండగా త్రీ టౌన్ మెకానిక్ సోదరులు!

Chandrawati blessesFormerMLABhanotnewlyweds

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

230 Posts

Latest News

ఉక్కు మహిళ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళి _ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్ ధైర్యం.. తెగువకు ప్రతీక ఝాన్సీ లక్ష్మీబాయి! ప్రభుత్వ మహిళా కళాశాలలో జయంతి వేడుకలు మా భూమి మాకు ఇవ్వండి! టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి అయ్యప్ప స్వామి విగ్రహాల వితరణ వేపకుంట్లలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కమిటీల సమావేశాలు _ సీవై పుల్లయ్య తోటి మెకానిక్ కుటుంబానికి అండగా త్రీ టౌన్ మెకానిక్ సోదరులు! నిరుపేదలకు అండగా వాసవి చిరు వ్యాపార సంఘం గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు అరెస్ట్ _ ఎస్‌ఐ జి. నరేష్ నవంబర్ 30న ఐక్య క్రిస్మస్ ఆరాధన _ క్రైస్తవ నాయకులకు పిలుపు రవీంద్ర భారతిలో ఘనంగా టీజేఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం _