29/11/2026, Sunday · 08:07:57 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి_షేక్ బషీరుద్దీన్

Yakub Pasha 28/11/2026 9:11 PM ఖమ్మం

పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి_షేక్ బషీరుద్దీన్
Want this news as a newspaper clip?Print News Clip

పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

విద్య, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం

– సీఐటీయూ జిల్లా నాయకులు షేక్ బషీరుద్దీన్

తిరుమలాయపాలెం, నవంబర్ 28 (పీపుల్స్ వాయిస్):

అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో, అంటరానితనం, కుల వివక్ష, మూఢనమ్మకాలపై పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని సీఐటీయూ జిల్లా నాయకులు షేక్ బషీరుద్దీన్ అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

స్థానిక గజ్జల వెంకటయ్య భవనంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సభకు వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ నాయకులు దాసరి మహేందర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షేక్ బషీరుద్దీన్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1890 నవంబర్ 28న జ్యోతిరావు పూలే మరణించారని, నేటికీ ఆయన ఆశయాలను స్మరించుకోవడం సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. అందరికీ విద్య అందించాలనే సంకల్పంతో తన జీవితాన్ని అంకితం చేసిన పూలే, తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యాబోధన చేసి ఆమెను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. అంటరానితనం, కుల వ్యవస్థ, సామాజిక అసమానతలు, మూఢనమ్మకాలపై ఆయన సాగించిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సైతం జ్యోతిరావు పూలే ఆలోచనల నుంచి స్ఫూర్తి పొందారని పేర్కొన్నారు.విద్య, సమానత్వం, సామాజిక న్యాయం సాధించినప్పుడే పూలేకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పీఎన్‌ఎం డివిజన్ కార్యదర్శి నందిగామ కృష్ణ, పీఎన్‌ఎం మండల కార్యదర్శి ఉపేందర్, సీఐటీయూ మండల కన్వీనర్ వశపంగు వీరన్న, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నెరుసుల వెంకటేశ్వర్లు, నాయకులు కొమ్ము నాగేశ్వరరావు, సుజాత, వెంకన్న, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: బురద చల్లితే.. కలం ఆగదు!– సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్

shek bashiruddinpuleashayalasadhanakupratiokkarukrushicheyali

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

282 Posts

Latest News

సత్తుపల్లి రాజకీయాల్లో నున్నా పుష్పలత పేరు.. తెరపైకి కొత్త సమీకరణాలు! తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యత్వ పుస్తకాల ఆవిష్కరణ చింతకాని పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ ఆర్యవైశ్యుల వనసమారాధనను విజయవంతం చేయండి!ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్ బురద చల్లితే.. కలం ఆగదు!– సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్ కోమట్లగూడెం సొసైటీలో 89 అక్రమ సభ్యత్వాలు రద్దు చేయాలి! పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా నూతన సారథులుగా రఘు, లక్ష్మణ్! రాజ్యాంగ హక్కులు ప్రతి సామాన్యుడికీ అందాలి! పల్లె నుంచి జాతీయ స్థాయికి.. కార్మిక ఉద్యమంలో తోట రామాంజనేయులుకు అరుదైన గుర్తింపు! రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘన నివాళులు