ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
బయోమెట్రిక్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలి: అడిషనల్ డీసీపీ రామానుజం
ఖమ్మం, నవంబర్ 26 (పీపుల్స్ వాయిస్):
తెలంగాణ పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో నవంబర్ 29న నిర్వహించనున్న ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు అడిషనల్ డీసీపీ, నోడల్ ఆఫీసర్ రామానుజం తెలిపారు.
పరీక్షల నేపథ్యంలో ఖమ్మంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో 34 పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వర్తించనున్న 95 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అభ్యర్థుల గుర్తింపు నిర్ధారణ, బయోమెట్రిక్ వివరాల నమోదు, వేలిముద్రల సేకరణ తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.బయోమెట్రిక్ ప్రక్రియను నిబంధనల ప్రకారం, ఎలాంటి సాంకేతిక లోపాలకు తావులేకుండా నిర్వహించాలని రామానుజం సూచించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్, ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బానోత్ రెడ్డి, అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ సాంబరాజు, పోలీస్ బయోమెట్రిక్ ఆఫీసర్ లవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: సోషల్ మీడియాలో కత్తుల ప్రదర్శన.. వ్యక్తిపై కేసు నమోదు












