ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి వనజీవి రామయ్య పేరు పెట్టాలి_IUML పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా

ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి వనజీవి రామయ్య పేరు పెట్టాలి.
IUML పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా
ఖమ్మం,నవంబర్ 25 (పీపుల్స్ వాయిస్)
ఖమ్మం పట్టణంలో నిర్మితమవుతున్న కేబుల్ బ్రిడ్జికి
వనజీవి రామయ్య గారి పేరు పెట్టాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో REST INN హోటల్ నందు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోIUML పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ బాజీ బాబా మాట్లాడుతూ ప్రకృతి ప్రేమికుడు పర్యావరణాన్ని కాపాడేందుకు కొన్ని లక్షల మొక్కలను నాటిన వనజీవి రామయ్య గారి పేరును కేబుల్ బ్రిడ్జికి పెట్టాలనే ప్రతిపాదనను తాము స్వాగతిస్తూ మద్దతు తెలియజేస్తున్నామని,
ఆయన అన్నారు. తమ పార్టీ జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుందని ఆయన తెలియజేశారు.
ఇది కూడా చదవండి :: కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి - PDSU జిల్లా సెక్రెటరీ లక్ష్మణ్












