ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి _ పోటు రంగారావు డిమాండ్

ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి _ పోటు రంగారావు డిమాండ్
ఖమ్మం, నవంబర్ 23 (పీపుల్స్ వాయిస్):
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో కోలేటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 29న హైదరాబాద్‌లో నిర్వహించే ప్రజాగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 24న ఖమ్మంలో పార్టీ జిల్లా ప్లీనం నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య తెలిపారు.ఈ సమావేశంలో రంగయ్య, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, జి. రామయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్, బందెల వెంకయ్య, ఆర్. శివలింగం తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: PRGTA జిల్లా కమిటీల ఎన్నికలు












