24/11/2026, Tuesday · 07:24:50 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి _ కలెక్టర్‌కు టీజేఏ ఖమ్మం జిల్లా కమిటీ వినతి

Yakub Pasha 24/11/2026 8:41 AM ఖమ్మం

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి _ కలెక్టర్‌కు టీజేఏ ఖమ్మం జిల్లా కమిటీ వినతి
Want this news as a newspaper clip?Print News Clip

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి

పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలి

జిల్లా కలెక్టర్‌కు టీజేఏ ఖమ్మం జిల్లా కమిటీ వినతి

ఖమ్మం, నవంబర్ 24 (పీపుల్స్ వాయిస్):
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జీ. నాగస్వామి మాట్లాడుతూ : ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఏళ్లుగా జర్నలిజంలో కొనసాగుతున్న అర్హులైన జర్నలిస్టులకు గతంలో కేటాయించిన భూమిని పంపిణీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను తక్షణమే జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎం. మణికుమార్, కార్యదర్శి మత్తి రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖాసీం, ట్రెజరర్ బోడపట్ల సతీష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎం.డి. రషీద్, కార్యదర్శి ఎం. చిన్ని, జిల్లా నాయకులు నల్లమోతు శ్రీనివాసరావు, గంజికుంట్ల వెంకన్న, వాసం రాజేంద్రప్రసాద్, కొత్త వెంకన్న, పామర్తి నాగేశ్వరరావు, వి. మోహన్ రావు, మల్లెబోయిన లక్షయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: అక్రిడిటేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి _ టీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్

District CommitteeResidentialplotsallottedeligiblejournalistsTJAKhammam

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

260 Posts

Latest News

అక్రిడిటేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి _ టీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్ ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టులకు ఎంపీ వద్దిరాజు మద్దతు కార్తిక వన సమారాధన విజయవంతం.. బంజారా కుటుంబాలకు కృతజ్ఞతలు _ వేడుకల్లో పాల్గొన్న బంజారా కుటుంబాలు నేలకొండపల్లిలో దోమల స్వైరవిహారం.. ప్రజారోగ్యంపై ఆందోళన! రాజేశ్వరపురంలో కబడ్డీ పోటీల కోలాహలం అయ్యప్ప అన్నదాన సేవకు కర్నాటి కృష్ణయ్య నగర్ వాసుల చేయూత _ నిత్య అన్నదానానికి రూ.10 వేల విరాళం అందజేత జర్నలిస్టు వెంకటరమణ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం ప్రతిజ్ఞ దివాస్ కార్యక్రమంలో మిట్టపల్లి కిషోర్‌కు ఘన సన్మానం వైభవంగా మోహన్ కృష్ణ – లాస్య వివాహ వేడుక నూతన వధూవరులకు ప్రముఖుల ఆశీస్సులు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సంతకాల సేకరణ ప్రారంభం