రాజేశ్వరపురంలో కబడ్డీ పోటీల కోలాహలం

రాజేశ్వరపురంలో కబడ్డీ పోటీల కోలాహలం
ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల జట్ల మధ్య హోరాహోరీ పోటీలు
నేలకొండపల్లి, నవంబర్ 24 (పీపుల్స్ వాయిస్):
కార్తీక పౌర్ణమి సందర్భంగా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. పీఏసీఎస్ మాజీ చైర్మన్ దండ ప్రవీణ్ కుమార్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. రెండు జిల్లాల జట్లు తలపడుతుండటంతో మైదానంలో క్రీడా సందడి నెలకొంది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దండా రంగయ్య, ఉపసర్పంచ్ రాసాల నవీన్, హాస్టల్ వార్డెన్ మహమ్మద్ అబ్దుల్ రవూఫ్, మాజీ ఎంపీటీసీ జట్టింగ్ వెంకన్న, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: అక్రిడిటేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి _ టీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్












