24/11/2026, Tuesday · 07:24:49 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టులకు ఎంపీ వద్దిరాజు మద్దతు

Yakub Pasha 24/11/2026 8:54 AM ఖమ్మం

ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టులకు ఎంపీ వద్దిరాజు మద్దతు
Want this news as a newspaper clip?Print News Clip

ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టులకు ఎంపీ వద్దిరాజు మద్దతు

జర్నలిస్టుల డిమాండ్ న్యాయమైనది.. వెంటనే స్థలాలు కేటాయించాలి

ఖమ్మం, నవంబర్ 24 (పీపుల్స్ వాయిస్):
ఖమ్మం జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన ఉద్యమానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టీయూడబ్ల్యూజే, టీజేఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం మయూరి సెంటర్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న డిమాండ్ న్యాయమైనదని పేర్కొన్నారు. చాలీచాలని వేతనాలు, ఉద్యోగ భద్రత లేక జర్నలిస్టులు కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లా నుంచి ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు వెంటనే స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు, గౌరవ సలహాదారు పారా నాగేశ్వరరావు, అధ్యక్షుడు శీలంశెట్టి వీరభద్రం, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవికుమార్, ఐజేయూ నాయకుడు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: అక్రిడిటేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి _ టీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్

journalists fightingVaddirajusupportshousingplots

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

260 Posts

Latest News

అక్రిడిటేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి _ టీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్ కార్తిక వన సమారాధన విజయవంతం.. బంజారా కుటుంబాలకు కృతజ్ఞతలు _ వేడుకల్లో పాల్గొన్న బంజారా కుటుంబాలు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి _ కలెక్టర్‌కు టీజేఏ ఖమ్మం జిల్లా కమిటీ వినతి నేలకొండపల్లిలో దోమల స్వైరవిహారం.. ప్రజారోగ్యంపై ఆందోళన! రాజేశ్వరపురంలో కబడ్డీ పోటీల కోలాహలం అయ్యప్ప అన్నదాన సేవకు కర్నాటి కృష్ణయ్య నగర్ వాసుల చేయూత _ నిత్య అన్నదానానికి రూ.10 వేల విరాళం అందజేత జర్నలిస్టు వెంకటరమణ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం ప్రతిజ్ఞ దివాస్ కార్యక్రమంలో మిట్టపల్లి కిషోర్‌కు ఘన సన్మానం వైభవంగా మోహన్ కృష్ణ – లాస్య వివాహ వేడుక నూతన వధూవరులకు ప్రముఖుల ఆశీస్సులు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సంతకాల సేకరణ ప్రారంభం