వైభవంగా మోహన్ కృష్ణ – లాస్య వివాహ వేడుక నూతన వధూవరులకు ప్రముఖుల ఆశీస్సులు

వైభవంగా మోహన్ కృష్ణ – లాస్య వివాహ వేడుక
కొమ్మూరులో నూతన వధూవరులకు ప్రముఖుల ఆశీస్సులు
కొమ్మూరు నవంబర్ 23 ( పీపుల్స్ వాయిస్): వంకాయలపాటి సీతయ్య మనవడు, బీఆర్ఎస్ నాయకులు వంకాయలపాటి సత్యనారాయణ – సుజాత దంపతుల కుమారుడు మోహన్ కృష్ణ వివాహం తూర్పుగోదావరి జిల్లా కొమ్మూరు గ్రామానికి చెందిన బొర్రా అంజనేయులు – కవిత దంపతుల కుమార్తె లాస్యతో ఆదివారం రాత్రి కొమ్మూరులో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు పలువురు రాజకీయ, సామాజిక రంగాల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. నూతన వధూవరులు మోహన్ కృష్ణ – లాస్యలను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు, నాగులవంచ ఉప సర్పంచ్ అంబటి శరత్ కుమార్, చింతకాని ప్రెస్ క్లబ్ అధ్యక్షురాలు జొన్నలగడ్డ మల్లేశ్వరి, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్యతో పాటు గ్రామ పెద్దలు ఆలస్యం రవి, సిలివేరు సైదులు, తోటకూరి వెంకటనరసయ్య, సామినేని బాబురావు, కొలేటి పెద్ద బ్రహ్మం, చిన్న బ్రహ్మం, అంబటి సైదేశ్వరరావు, అంబటి సత్యనారాయణ, తోటకూరి చిన్న, తన్నీరు చిన్న అబ్బాయి, గుడిపూడి మాధవరావు, నెల్లూరి రమేష్, వంకాయలపాటి రమణ, తన్నీరు రామకృష్ణ, గునుగుంట్ల సత్యనారాయణరెడ్డి, కన్నీటి శ్రీనివాసరావు, తటుకూరి చిన్న, కొల్లి బాబు, వేముల శ్రీనివాసరావు, మండేపూడి మదన్, కిలారి నరసింహారావు, యల్లంపల్లి సతీష్, పరిగెల లక్ష్మీనారాయణ, ఐనాల నాగేశ్వరరావు, గోవిందరావు, శీలం స్వామి, రావులపెంట శ్రీను, పడిశాల కేశవరావు, రవి, యెనిశెట్టి రాజేశ్వరరావు, వెచ్చ మంగయ్య, సీనియర్ రిపోర్టర్ నన్నాక అప్పారావు తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఇది కూడా చదవండి :: PRGTA జిల్లా కమిటీల ఎన్నికలు












